Nidhi Agarwal: ‘వీరమల్లు..’ కష్టం.. నాకెంతో విలువైనది - telugu news Nidhhi Agerwal about hari hara Veera Mallu
close
Updated : 21/10/2021 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nidhi Agarwal: ‘వీరమల్లు..’ కష్టం.. నాకెంతో విలువైనది

‘మోడ్రన్‌ గర్ల్‌.. గ్లామర్‌ హీరోయిన్‌’.. అన్న మాటలు వినీ వినీ అలిసిపోయానంటోంది నటి నిధి అగర్వాల్‌. తెరపై గ్లామర్‌ డాల్‌గా కనిపించడం కన్నా.. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించడమే తనకిష్టమని చెబుతోంది. ప్రస్తుతం ఈ అందాల నిధి.. పవన్‌ కల్యాణ్‌కు జోడీగా  ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రమిది. ఈ చిత్ర విశేషాలను నిధి అగర్వాల్‌ ఇటీవల పంచుకుంది. ‘‘వీరమల్లు..’లో నేను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర ఇది. శారీరకంగా నాకెంతో    సవాల్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం చాలా ఆభరణాలు ధరించాను. ఒంటిపై ధరించిన కాస్ట్యూమ్స్‌ చాలా బరువైనవి. ప్రతిదీ చేతితో కుట్టినదే. అందుకే వీటిని క్యారీ చేస్తూ.. షూట్‌లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించేది. ఓ షాట్‌ అయిపోతే జాగ్రత్తగా ఓ దగ్గర కూర్చోవడమే తప్ప.. విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదు. అయితే ఈ కష్టమంతా నాకెంతో విలువైనదిగా అనిపించేది. నటిగా ఇంత అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకుఆనందంగా ఉంది’’ అని నిధి చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం ఆమె తెలుగులో ‘హీరో’ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని