Radheshyam: తలరాతలు చదివేస్తాడు
close
Updated : 24/10/2021 05:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radheshyam: తలరాతలు చదివేస్తాడు

‘‘నేను దేవుణ్ని కాదు.. అలాగని మీలో ఒక్కడిని కూడా కాదు’’ అంటున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించనున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ, నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా అది మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడ్ని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’’ అంటూ టీజర్‌లో ప్రభాస్‌ పలికిన సంభాషణలు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ఆయన్ని ఈ ప్రచార చిత్రంలో రకరకాల షాట్స్‌లో.. సరికొత్త లుక్‌లలో చూపించారు. ఆఖర్లో ఓ లైట్‌ టవర్‌ వరదల తాకిడి కుప్పకూలిపోవడం, నెత్తురోడుతూ ప్రభాస్‌ నడిచొస్తుండటం వంటి సన్నివేశాలు ఉత్సుకత కలిగించేలా ఉన్నాయి. టీజర్‌ సాగిన తీరును బట్టి.. ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని