Cinema news: ‘తెలంగాణ దేవుడు’ వస్తున్నాడు - telugu news Srikanth Starer Telangana Devudu Team Special Press Meet
close
Updated : 24/10/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: ‘తెలంగాణ దేవుడు’ వస్తున్నాడు

శ్రీకాంత్‌ ఉద్యమ నాయకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్‌ వడత్యా తెరకెక్కిస్తున్నారు. మొహహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్నారు. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడు. బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, వెంకట్‌, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబరు 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఇంత గొప్ప చిత్రం తెరకెక్కించే అవకాశమిచ్చినందుకు నిర్మాతకు థ్యాంక్స్‌.  ఆయనతో పాటు నటీనటుల సహకారం వల్ల చిత్రం బాగా వచ్చింద’’న్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనేది కళ్లకు కట్టినట్లు చూపించాం. ఈ తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జిషాన్‌, చిట్టిబాబు, కాశినాథ్‌, అప్పాజీ పాల్గొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని