F3: ‘ఎఫ్‌ 3’ విడుదల ఖరారు - telugu news F3 Release Date Announced
close
Updated : 25/10/2021 07:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

F3: ‘ఎఫ్‌ 3’ విడుదల ఖరారు

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఆ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. విజయవంతమైన ‘ఎఫ్‌2’ తర్వాత, మరింత ఫన్‌...  అంటూ రూపొందుతున్న చిత్రమిది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌  పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు  సమర్పకులు. ‘ఎఫ్‌2’ సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ‘ఎఫ్‌3’ సంక్రాంతి లక్ష్యంగానే పట్టాలెక్కింది. కానీ సినిమాని ఫిబ్రవరి 25న తీసుకు రావాలని నిర్ణయించారు. ‘‘ఈ రకమైన చిత్రాలకి ప్రత్యేకమైన సందర్భం, సీజన్‌లతో అవసరం లేదు. ఎప్పుడు విడుదలైనా సరే, ఉల్లాసకరమైన వినోదంతో ఇంటిల్లిపాదినీ మెప్పిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై  కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, మెహ్రీన్‌తోపాటు, మూడో కథానాయికగా సోనాల్‌ చౌహాన్‌ ఇటీవలే సెట్లోకి అడుగుపెట్టింది. రాజేంద్రప్రసాద్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: తమ్మిరాజు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని