Manchu Vishnu: నాయికలకి గౌరవం ఇవ్వాలి
close
Updated : 25/10/2021 06:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Manchu Vishnu: నాయికలకి గౌరవం ఇవ్వాలి

‘‘మహిళలు తల్లితో సమానం. కథానాయికలకి తగిన గౌరవం ఇవ్వాలి. వాళ్ల గురించి అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోలు పెడితే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ చూస్తూ ఊరుకోద’’న్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. కొన్ని యూ ట్యూబ్‌ ఛానళ్ల రాతలు హద్దులు మీరుతున్నాయని ఆయన చెప్పారు. ఇటీవలే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుని తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆదివారం హైదరాబాద్‌లో సన్మానించింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడారు. ‘‘పరిధి దాటే యూ ట్యూబ్‌ ఛానళ్లని నియంత్రించేందుకు ఓ సెల్‌ని ఏర్పాటు చేస్తాం. అది మా ఎజెండాలో ఓ భాగం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రధాన కార్యదర్శి శివబాలాజీ, ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభు, ఇతర కార్యవర్గం పాల్గొంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని