Rangamarthanda: ‘రంగమార్తాండ’కు చిరు సాయం - telugu news megastar Chiranjeevi Lends His Voice For Rangamarthanda
close
Updated : 27/10/2021 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rangamarthanda: ‘రంగమార్తాండ’కు చిరు సాయం

ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. ఇప్పుడీ చిత్రం కోసం చిరంజీవి గాత్రదానం చేశారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిరు డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘తన మెగా వాయిస్‌ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవికి థ్యాంక్స్‌’’ అని ఆ ఫొటోలకు ఓ వ్యాఖ్యను జత చేశారు కృష్ణవంశీ. విజయవంతమైన మరాఠి సినిమా ‘నటసామ్రాట్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో రంగస్థల కళాకారుల జీవితాల్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. దీంట్లో ఓ నటుడి జీవితాన్ని గద్య కవిత ద్వారా ఆవిష్కరించనున్నారు. సినిమా  ఆరంభంలో.. ముగింపులో వచ్చే ఆ కవితాత్మక పంక్తుల్ని చిరు తన స్వరంతో వినిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకి ఇళయరాజా స్వరాలందిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని