Bhola Shankar: ‘భోళా శంకర్‌’.. చలో ముహూర్తం - telugu news bhola shankar Shooting will Starts from Nov 11
close
Updated : 28/10/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bhola Shankar: ‘భోళా శంకర్‌’.. చలో ముహూర్తం

చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్‌’ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఈ చిత్రం నవంబర్‌ 11న ఉదయం 7:45 గంటలకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలవుతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల బంధం చుట్టూ తిరిగే కథతో రూపొందుతోంది. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది.  నవంబర్‌ 15 నుంచే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. ఇందులో చిరంజీవి సరసన నటించే నాయిక ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాకి మహతి స్వర సాగర్‌ స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం చిరు నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణ దశలో ఉంది. ఇక దర్శకుడు బాబీతో చేయనున్న కొత్త చిత్రం నవంబర్‌లోనే పట్టాలెక్కనుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని