Pushpaka Vimanam: నవ్వులు పంచే ‘పుష్పక విమానం’ - Telugu news Pushpaka Vimanam Team Special Press meet
close
Updated : 28/10/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpaka Vimanam: నవ్వులు పంచే ‘పుష్పక విమానం’

నంద్‌ దేవరకొండ కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం ‘పుష్పక విమానం’. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని ఆంధ్రా, సీడెడ్‌లలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, నైజాంలో గ్లోబల్‌ సినిమాస్‌, ఓవర్సీస్‌లో ఫ్రీజ్‌ ఫ్రేమ్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేయనున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా రూపొందించాం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది. ఈనెల 30న ట్రైలర్‌   విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిరియాల, ఛాయాగ్రహణం: హెస్టిన్‌ జోస్‌ జోసెఫ్‌.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని