13వేల అడుగుల ఎత్తులో..
close
Updated : 24/10/2020 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

13వేల అడుగుల ఎత్తులో..

థానాయకుడు నాగార్జున సముద్రమట్టానికి దాదాపు 13000 అడుగులు ఎత్తైన హిమాలయ ప్రాంతానికి చేరుకున్నారు. ఏడాదిలో దాదాపు ఆరునెలల పాటు మూసివేసి ఉండే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమది. ఇప్పుడక్కడే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు నాగ్‌. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్పింగ్‌ను అభిమానులతో పంచుకున్నారు. దీంట్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ అద్భుతమైన ఉదయం రొహ్‌తంగ్‌ పాస్‌లో ఉన్నా. సముద్ర మట్టానికి 3,980 మీటర్లు ఎత్తులో.. అంటే దాదాపు 13000 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ  ప్రాంతమిది. నవంబరు నుంచి మే వరకు ఈ దారిని మూసేస్తారు. ఇక్కడ ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రీకరణ చాలా బాగా జరుగుతోంది. ఎత్తైన పర్వతాలు.. నీలి ఆకాశం.. అద్భుతమైన జలపాతాలతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంది. ఏడు నెలల తర్వాత ఇలాంటి ప్రదేశానికి రావడం చాలా ఆనందంగా ఉంది. చిత్రీకరణ 21రోజుల్లో పూర్తయిపోతుంది. దాని తర్వాత వచ్చేస్తాను’’ అని తెలియజేశారు. ఈ చిత్రంలో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌ వర్మగా దర్శనమివ్వనున్నారు. అహిషర్‌ సోలమన్‌ దర్శకుడు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని