మారేడుమిల్లి అడవులకు పుష్పరాజ్‌
close
Published : 01/11/2020 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారేడుమిల్లి అడవులకు పుష్పరాజ్‌

డవిలోకి అడుగు పెట్టబోతున్నాడు అల్లు అర్జున్‌. ఆయన నెల రోజులపాటు ఏకధాటిగా చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 6 నుంచి షురూ కాబోతోందని తెలుస్తోంది. అందుకోసం మారేడుమిల్లి అడవుల్లో సర్వం సన్నద్ధం చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది.

అల్లు అర్జున్‌ మాస్‌ పాత్రలో, పుష్పరాజ్‌ అనే యువకుడిగా కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా సినిమా కోసం చిత్తూరు యాసలో తర్ఫీదు పొందారు. నెల రోజులపాటు కీలకమైన సన్నివేశాలతో పాటు పాట కూడా తెరకెక్కిస్తారని సమాచారం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని