
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ఆయనను ‘బాఫ్టా బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్’గా సోమవారం నియమించింది. జ్యూరీ సభ్యులు, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన మన దేశంలోని సినిమా, క్రీడలు, టెలివిజన్ రంగాల్లో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించనున్నారు. ‘‘భారత్ నుంచి అద్భుతప్రతిభను వెలికితీసి ప్రపంచ వేదికపై నిలిపే అవకాశం రావడం సువర్ణవకాశంగా భావిస్తున్నాను. బాఫ్టాతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’’ అని ఏఆర్ రెహమాన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘హిందీ, తెలుగు, తమిళ సినిమాలతో అనుబంధం ఉన్న రెహమాన్ సేవలు బాఫ్టాకు విస్తృతంగా ఉపయోగ పడతాయి. ఆయన అంబాసిడర్‌గా నియమితులవ్వడం ఆనందంగా ఉంది’’ అని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమాండ బెర్రీ పేర్కొన్నారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కళాకారులకు సంవత్సరం పాటు బాఫ్టా మార్గనిర్దేశనం చేయనుంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..