రష్మిక రయ్‌ రయ్‌
close
Published : 09/01/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక రయ్‌ రయ్‌

రష్మిక పాన్‌ ఇండియా గుర్తింపుని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే దక్షిణాదిలో ఆమె అగ్రనాయికగా కొనసాగుతోంది. ఇప్పుడు హిందీలోకీ అడుగు పెట్టింది. ‘మిషన్‌ మజ్ను’ పేరుతో రూపొందుతున్న సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ శుక్రవారమే మొదలైంది. కథానాయకుడితో కలిసి బైక్‌పై దూసుకెళుతున్న సెట్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. తెలుగులోనూ ఆమె వరుసగా సినిమాలకి పచ్చజెండా ఊపుతోంది. ఇప్పటికే ‘పుష్ప’ కోసం రంగంలోకి దిగిన రష్మిక, తదుపరి శర్వానంద్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతోంది. అన్నీ కుదిరితే ఆమె నాగచైతన్యతోనూ కలిసి వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశాలున్నాయి. నాగచైతన్య  ‘థ్యాంక్యూ’లో ముగ్గురు నాయికలకి చోటుంది. అందులో ఓ నాయికగా రష్మికని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అలాగే నాగచైతన్యతోనే మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో నాయికగా రష్మికని ఎంపిక చేసుకోవాలని ముందుగానే నిర్ణయించినట్టు తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని