
‘‘వాణిజ్య ప్రధానమైన సినిమా చేసినా... అందులో ఏదో రకంగా కొత్తదనం ఉండాలనుకుంటా. నటుడిగానూ నేను సవాళ్లని ఇష్టపడతా. అచ్చంగా... అలాంటి కథ, పాత్రలతోనే ‘అల్లుడు అదుర్స్’ రూపొందింది’’ అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆయన కథా నాయకుడిగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా గురువారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాయిశ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘పరాజయం ఎదురైతే మళ్లీ వెంటనే సినిమా మొదలు పెడతామేమో కానీ.. విజయం వచ్చిందంటే జాగ్రత్తగా అడుగులు వేస్తాం. ‘రాక్షసుడు’ విజయం తర్వాత మూడు నెలలపాటు కథలు వినడంపైనే దృష్టిపెట్టా. సంతోష్ శ్రీనివాస్ అన్న చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. ముఖ్యంగా ద్వితీయార్థం నాకు బాగా నచ్చింది. రోహిత్‌శెట్టి ‘గోల్మాల్’ చూస్తున్నప్పుడు ఒక వాణిజ్య కథలో ‘హారర్ అంశాలా, భలే ఉందే’ అని ఆశ్చర్యపోయా. మళ్లీ అలాంటి అనుభూతి ఈ కథ విన్నప్పుడు కలిగింది. ఎప్పుడూ మనం చూసే కుటుంబ కథలు కాకుండా, ఇది చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలూ ఆస్వాదిస్తారు’’.
* ‘‘మా కథలో దెయ్యం ఉంటుంది కానీ...అది భయపెట్టే దెయ్యం కాదు, కామెడీ దెయ్యం. పాత్రలో చాలా కోణాలు కనిపిస్తాయి. అందుకే నటన పరంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. సన్నివేశాలు పక్కాగా రావడం కోసం శిక్షణ కూడా తీసుకుని నటించా. ఇందులో డ్యాన్స్ చాలా బాగుంటుంది. ‘అల్లుడు శీను’గా నేను పరిచయమయ్యా. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ అంటూ వస్తున్నా. అల్లుడు అనే మాట నాకు బాగా అచ్చొచ్చింది’’.
* ‘‘నా సినిమాలు హిందీలో డబ్ అవ్వడం, అంతర్జాలంలో వాటికి చక్కటి ఆదరణ లభిస్తుండడంతో ఉత్తరాదిలో నన్ను అభిమానించేవాళ్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ‘అల్లుడు అదుర్స్’ పాట చిత్రీకరణ కోసం కశ్మీర్ వెళితే అక్కడ అందరూ గుర్తుపట్టి మాట్లాడిస్తున్నారు. నేను హిందీలో పరిచయం కావడానికి ఇది సరైన సమయం అనిపించింది. సరిగ్గా ఇదే సమయంలోనే ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం హైదరాబాద్‌లో ఒక సెట్ వేస్తున్నాం. కథానాయిక ఎంపిక ప్రక్రియ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీయాలనే ఆలోచనలో ఉన్నాం.’’
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భారత్ చిరస్మరణీయ విజయం..
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!