close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘రెడ్‌’కి నిజమైన హీరో ఆయనే!

‘‘నా దృష్టిలో ‘రెడ్‌’ చిత్రానికి నిజమైన హీరో మా పెదనాన్న స్రవంతి రవికిశోర్‌. కరోనా సమయంలో వచ్చిన ఇబ్బందుల్ని తట్టుకుని, సినిమాని చంటి బిడ్డలా కాపాడుతూ వచ్చారు. ఈ రోజు థియేటర్ల వరకు తీసుకొచ్చార’’న్నారు కథానాయకుడు రామ్‌ పోతినేని. ఆయన ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్‌’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. స్రవంతి రవికిశోర్‌ నిర్మాత. సంక్రాంతి సందర్భంగా గురువారం చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ముందస్తు విడుదల వేడుకని నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్‌ మాట్లాడుతూ ‘‘పరిశ్రమలో  రచయితలంటే నాకు గౌరవం. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సంభాషణల్ని మా పెదనాన్న చెబుతున్నప్పుడే సినిమా చేయాలనిపించింది. ప్రేక్షకుడిని అంతగా ప్రభావితం చేయగల ప్రతిభ రచయితకి ఉంటుందని అప్పుడు అర్థమైంది. నాకు రచయితల మీద గౌరవం పెరిగింది త్రివిక్రమ్‌ వల్లే. ఆయన ఈ వేడుకకి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘రెడ్‌’ చాలా కొత్త అనుభవాన్నిచ్చిన చిత్రం. కిశోర్‌ తిరుమల థ్రిల్లర్‌ తీస్తున్నారనగానే అందరూ షాక్‌ అయ్యారు. ఆయన మంచి మాస్‌ సినిమా కూడా తీయగల ప్రతిభ ఉన్న సరస్వతీ పుత్రుడు. కథానాయికలు మాళవిక, అమృత, నివేతా మంచి పాత్రల్లో కనిపిస్తారు. మణిశర్మతో పాటు సాంకేతిక బృందమంతా చక్కటి పనితీరుని కనబరిచింది. నాలో ఈ హుషారుకి కారణమైన నా అభిమానులకి, 15 యేళ్ల కెరీర్‌లో నాకు తోడుగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘రామ్‌ని ‘దేవదాస్‌’ సినిమాలో చూశాక ‘అబ్బాయి మెరుపుతీగలా ఉన్నాడ’ని నిర్మాత స్రవంతి రవికిశోర్‌తో అన్నాను. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంలో రామ్‌లా నటించడమంటే... చూసినంత సులభం కాదు. రామ్‌ ఇంకా చాలా యేళ్లు గుర్తుండిపోయే  సినిమాలు చేయాలి. ఖాళీగా ఉన్న నాతో ‘స్వయంవరం’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’లాంటి చిత్రాలు రాయించి, నా కెరీర్‌ని మార్చేశారు నిర్మాత రవికిశోర్‌.  స్క్రిప్టులో మొదటి సన్నివేశం నుంచి, చివరి వరకు అంత బలంగా చదివే నిర్మాత’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి, కళాదర్శకుడు ఎ.ఎస్‌.ప్రకాశ్‌, ఎడిటర్‌ జునైద్‌, చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని, నటుడు సత్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు