
టీజర్లు... భోగిమంటల్లా వెలిగాయి. పోస్టర్లు... వాకిట్లో తోరణాల్లా మెరిశాయి. ట్రైలర్లు... ముగ్గులతో మెరుస్తున్న మన లోగిళ్లలా కళకళలాడాయి. కొత్త సంభాషణలు, కొత్త విడుదల తేదీలు... కొత్త నేపథ్యాలు, కొత్త కథలు... మకర సంక్రాంతికి... సినిమా కాంతి తోడైంది. తెలుగు ప్రేక్షకులకు పండగ ఆనందం రెట్టింపైంది.
మనకే కాదు... మన సినిమాకి పెద్ద పండగ సంక్రాంతి. ఒక పక్క కొత్త చిత్రాలు వరుస కడుతుంటే... మరోపక్క సెట్స్‌పై ఉన్న సినిమాలు ప్రచారంతో సందడి చేస్తుంటాయి. లుక్కులు, టీజర్లు, ట్రైలర్లు, విడుదల తేదీల వివరాలు బయటికొస్తుంటాయి. ఎప్పట్లాగే ఈసారి పండక్కి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. సెట్స్‌పై ఉన్న కొత్త చిత్రాలు ప్రచారంలో జోరు పెంచి... ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాల సంక్రాంతి పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలూ వేసవి సందర్భంగా విడుదల కానున్నాయి.
* వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘ఉప్పెన’ టీజర్ విడుదలైంది. ప్రేమలో మునిగి తేలండి... అంటూ ఊరిస్తోంది చిత్రబృందం.
* వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్3’ పోస్టర్ విడుదలైంది.
* సుమంత్ కథానాయకుడిగా నటించిన ‘కపటధారి’ ట్రైలర్‌ని నాగచైతన్య, సమంత జంట విడుదల చేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
* మన దేశంలో 7 భాషల్లో విడుదల కానున్న ఉపేంద్ర పాన్ ఇండియా ‘కబ్జా’ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇందులో మరో అగ్ర కథానాయకుడు సుదీప్ నటిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన పోషిస్తున్న భార్గవ్ భక్షి లుక్‌ని విడుదల చేశారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భారత్ అద్భుత విజయం
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!