‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత హీరో మహేష్‌బాబు నుంచి రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ కథానాయిక. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో దుబాయ్‌లో మొదలు కానుందని సమాచారం. ఇప్పుడిందు కోసమే తన లుక్‌ని మార్చుకునే పనిలో పడ్డారు మహేష్. ఆయన ఈ మధ్య పొడవాటి జుట్టు.. విభిన్నమైన లుక్స్‌తో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఆ లుక్స్ ఈ చిత్రం కోసం చేస్తున్న ప్రయత్నమే అని తెలిసింది. అంతేకాదు ఈ చిత్రం కోసం ఆయన కాస్త బరువు తగ్గి మరింత స్టైలిష్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసమే మహేష్ జిమ్‌లో పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కాబోయే తొలి షెడ్యూల్ దాదాపు నెలకు పైగా కొనసాగనుందని, అది పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో మిగిలిన టాకీ పార్ట్ చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
మరిన్ని
కొత్త సినిమాలు
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
గుసగుసలు
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- పవన్ భార్యగా సాయిపల్లవి!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!