close
Published : 23/01/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పందెం ప్రమాదకరం

చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒకడు పుడతాడు... ఆటకే గుర్తింపు తెచ్చేవాడు. ప్రాచీనమైన విలువిద్య కోసం ఎవరేం చేశారో, ఎలాంటి గుర్తింపుని తెచ్చారో తెలియాలంటే మాత్రం ‘లక్ష్య’ చూడాల్సిందే. నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కేతికాశర్మ నాయిక. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రమిది. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం టీజర్‌ని విడుదల చేశారు. జగపతిబాబు వాయిస్‌ ఓవర్‌తో సాగే ఈ టీజర్‌లో నాగశౌర్య పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. ఆయన లుక్‌తోపాటు, ‘పడి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం’ అనే సంభాషణ టీజర్‌కి ప్రధాన ఆక్షణగా నిలిచింది. ‘‘విలువిద్యలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వ్యక్తిగా నాగశౌర్య కనిపిస్తాడు. ఆయన ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సిక్స్‌ ప్యాక్‌ దేహాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంద]’’ని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి, సంగీతం: కాలభైరవ, కూర్పు: జునైద్‌.

అందమైన వరుడు
నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న మరో సినిమా ‘వరుడు కావలెను’ ప్రచార చిత్రమూ విడుదలైంది. సూటూ బూటుతో ముస్తావుతున్న వీడియోని ఈ చిత్రబృందం విడుదల చేసింది. అందులో నాగశౌర్య అందంగా కనిపించి అలరించాడు. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నాగశౌర్యకి జోడీగా రీతూవర్మ నటిస్తోంది. మేలో సినిమాని విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది చిత్రబృందం.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని