రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ చేయనున్న చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా ఉంది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీపిక పదుకొణే కథా నాయిక. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ఆసక్తికర అప్డేట్లను అభిమానులతో పంచుకోనున్నారు చిత్ర దర్శకుడు. ఈ విషయాన్ని శనివారం ట్విటర్ వేదికగా తెలియజేశారు. నిజానికి సంక్రాంతి కానుకగానే ఓ ప్రత్యేకమైన అప్డేట్ ఇస్తానని నాగ్ అశ్విన్ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఇప్పటివరకు ఆయన ఎలాంటి శుభవార్త వినిపించకపోవడంతో ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై తాజాగా నాగీ స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా ఈ జనవరి 29న ఒకటి.. ఫిబ్రవరి 26న మరొకటి.. అప్డేట్స్ అందించనున్నాం’’ అని స్పష్టత ఇచ్చారు. ఓ సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాని ముస్తాబు చేయబోతున్నారు. గ్రాఫిక్స్‌కి ఎంతో ప్రాధాన్యముంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా