ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ ఒకటి. ఈ చిత్రం విడుదల గురించి ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో విడుదల విషయంలో చర్చ మరింతగా ఊపందుకుంది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారనే మాట ఫిల్మ్ నగర్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ దశలోనే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ అక్టోబరు 8న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల కాబోతోందనే సంకేతాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ని పంచుకుంది. ఆ వెంటనే ఆమె ఈ పోస్ట్‌ని తొలగించినా ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ ఉద్ధృతంగా సాగింది. మరి ఆమె సంకేతాలకి తగ్గట్టుగా చిత్రం దసరాకే రాబోతోందా?, మరో తేదీని ఖరారు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఓవర్సీస్లో, స్థానికంగా పరిస్థితులు పూర్తిగా అనుకూలం అనుకున్నప్పుడే విడుదల తేదీ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం. రూ. 400 కోట్లు పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాని అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడే విడుదల చేస్తారని సమాచారం. కరోనా తర్వాత స్థానిక మార్కెట్ ఊపందుకున్నా... ఓవర్సీస్లో ఇంకా ఆ భయాలు వెంటాడుతున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా.. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. అలియాభట్, అజయ్ దేవగణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా