‘‘కథ ఏంటి?’ అన్నది ఎప్పుడూ ముఖ్యం కాదు. దాన్ని తెరపై ఎంత అద్భుతంగా చూపించామన్నదే ముఖ్యం. అందుకే ప్రేమకథలు ఎన్ని వచ్చినా.. దాన్ని మళ్లీ అందంగా చూపిస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తుంటార’’న్నారు మున్నా. ‘30రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెడుతున్న కొత్త దర్శకుడాయన. ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఎస్.వి.బాబు నిర్మాత. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు మున్నా.
* ‘‘పునర్జన్మల నేపథ్యంలో సాగే ఓ సరికొత్త ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. దీనికి ఒకరకంగా ‘దేవదాసు’ సినిమా స్ఫూర్తి. సినిమాలో నాయకానాయికలకు ఒకరంటే మరొకరికి అసలు పడదు. 30రోజుల్లో కచ్చితంగా ప్రేమించుకోవాలి అనుకుంటారు. వాళ్లిలా ఎందుకు ప్రేమించుకోవాలి అనుకుంటారు? ఈ క్రమంలో వాళ్లు చేసిన ప్రయత్నాలేంటి? గత జన్మలో వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? అన్నది మిగతా చిత్ర కథ. నవ్వు.. లవ్వు రెండూ సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. సినిమాకి అనూప్ రూబెన్స్ అందించిన పాటలే బలం.
* ‘‘నేను పుట్టి పెరిగిందంతా తూర్పు గోదావరిలోనే. వైజాగ్‌లోని గీతం కాలేజీలో ఎంసీఏ చదివా. చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలపై ఆసక్తి ఎక్కువ. కాలేజీ రోజుల్లోనే ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో ఇష్టం లేకపోయినా అటువైపు వెళ్లా. కొన్నిరోజులు చేశాక నా వల్ల కాదని చెప్పి.. 2011లో పూర్తిగా సినిమాల వైపు వచ్చేశా. సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య 2’, ‘100% లవ్’, ‘1 నేనొక్కడినే’ చిత్రాలకి రచయితగా పనిచేశా. తర్వాత మరికొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా చేశా. నిజానికి ఈ చిత్ర కథాలోచన కిరణ్ది. నేను స్క్రీన్‌ప్లే అందించా. లాక్డౌన్లో నాలుగైదు కథలు సిద్ధం చేసుకున్నా. రెండు పెద్ద బ్యానర్ల నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్నా. ఈ చిత్ర ఫలితాన్ని బట్టి తర్వాతి సినిమాలుంటాయి’’.
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది