close
గుస‌గుస‌లు
మరోసారి కలుస్తారా?

తొలిసారి ‘గబ్బర్‌ సింగ్‌’లో జోడీ కట్టి విజయాన్ని అందుకున్నారు పవన్‌కల్యాణ్‌ - శ్రుతిహాసన్‌. ఆ తర్వాత ‘కాటమ రాయుడు’తో మరోసారి సందడి చేశారు. మూడోసారి ఈ కలయిక కుదిరే అవకాశం ఉంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వకీల్‌సాబ్‌’లో ఓ కీలకపాత్ర కోసం శ్రుతి హాసన్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఫ్లాష్‌ బ్యాక్‌ నేపథ్యంలో వచ్చే ఓ కీలక ఘట్టంలో నటించడం కోసం శ్రుతిని ఎంపిక చేసుకోబోతున్నట్టు సమాచారం. శ్రీరామ్‌వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. మేలో ఈ చిత్రం రానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ’ అనే గీతాన్ని విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి  రచించిన గీతమిది. తమన్‌ స్వరకల్పనలో సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.