
హీరో ప్రభాస్ తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’కు సంబంధించిన తెర వెనుక పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. రామాయణ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా దర్శనమివ్వబోతుండగా.. ప్రతినాయకుడు లంకేష్‌గా సైఫ్అలీ ఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. సీత పాత్రను పోషించనున్న కథానాయిక ఎవరన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ పాత్ర కోసం నిన్నమొన్నటి వరకు కియారా అడ్వానీ, కీర్తి సురేష్ తదితరుల పేర్లు వినిపించాయి. ఇప్పుడీ పాత్రకు కృతి సనన్ ఫైనల్ అయినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ నాయికల్లో ఒకరిగా మెరుపులు మెరిపిస్తున్న ఈ భామ.. గతంలో తెలుగులో ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల్లో నటించింది. ఇవి సరైన ఫలితాలు అందుకోకపోవడంతో మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడిన్నాళ్లకు ‘ఆదిపురుష్’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో లక్ష్మణుడి పాత్రకు బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో త్రీడీలో నిర్మితమవనున్న ఈ చిత్రాన్ని.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నారు. జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2022 ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!
- తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
- కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
- 36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
- ‘ఓకే చైనా’ అనని అమెరికా!
- నేను బౌలర్‌ను మాత్రమే కాదు.. ఆల్‌రౌండరని పిలవొచ్చు
- ‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్
- అసహజ బంధం.. విషాదాంతం
- నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్ఇండియా
- జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదు