Prabhas ‘సలార్‌’లో ప్రత్యేకంగా?
close
Published : 04/05/2021 20:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prabhas ‘సలార్‌’లో ప్రత్యేకంగా?

థానాయకుడు ప్రభాస్‌ నుంచి రానున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘సలార్‌’ కూడా ఒకటి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మరో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడీ పాట కోసం కన్నడ తార శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారని సమాచారం. ఆమె ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీఎఫ్‌’తోనే నాయికగా తెరపై మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో యష్‌తో ఆమె చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ ఆమె ప్రతిభని మెచ్చి ‘సలార్‌’లో ప్రత్యేక గీతానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీనిధి ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ 2’లోనూ యష్‌ సరసన ఆడిపాడుతోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని