Ravi teja: ప్రభుత్వ అధికారిగా...!
close
Published : 15/06/2021 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ravi teja: ప్రభుత్వ అధికారిగా...!

వితేజ ఈ ఏడాది ఆరంభంలో ‘క్రాక్‌’గా సందడి చేశారు. ప్రస్తుతం ‘ఖిలాడి’గా వినోదం పంచే  ప్రయత్నంలో ఉన్నారు. తదుపరి సినిమాలో పూర్తి భిన్నంగా ఆయన ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి. 1990ల నేపథ్యంలో సాగే ఈ కథ రీత్యా రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా, ఇప్పటివరకు చూడని లుక్‌లో కనిపిస్తారని సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగా సిద్ధమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. రవితేజ సరసన ఇద్దరు కథానాయికలు ఆడిపాడనున్నారు. ఓ నాయికగా ఇప్పటికే దివ్యాంశ కౌశిక్‌ ఎంపికైంది. మరో భామని ఎంపిక చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉంది. త్వరలోనే చిత్రీకరణని షురూ చేయనున్నారు. స్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తుండగా, సత్యన్‌ సూర్యన్‌ కెమెరా    బాధ్యతలు నిర్వర్తించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని