Pawan kalyan: మరో ఇద్దరు దర్శకులు!
close
Published : 01/09/2021 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan kalyan: మరో ఇద్దరు దర్శకులు!

గ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘భీమ్లానాయక్‌’, ‘హరి హర వీరమల్లు’ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. మరోపక్క హరీష్‌శంకర్‌, సురేందర్‌ రెడ్డి సిద్ధం చేసిన కథలూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కొత్తతరం దర్శకులు ఇంకో ఇద్దరు పవన్‌ కల్యాణ్‌ కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాస్తవికతకి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీస్తున్న ఆ దర్శకులతో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు కథలు సిద్ధం చేయిస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌ కొత్తతరం దర్శకులతో పనిచేయడాన్ని ఇష్టపడుతుంటారు. తొలి ప్రయత్నంలోనే మంచి సినిమాలు తీసి మెప్పించిన ఆ ఇద్దరు దర్శకులు పవన్‌ మార్క్‌ అంశాలతో కథలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వీటిపై మరికొన్ని రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ 2న ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ గీతాన్ని విడుదల చేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని