వంశీ పైడిపల్లి చిత్రం.. విజయ్‌తో ఖరారు
close
Published : 04/05/2021 19:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంశీ పైడిపల్లి చిత్రం.. విజయ్‌తో ఖరారు

‘ఊపిరి’, ‘మహర్షి’ చిత్రాలతో సత్తా చాటారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ‘మహర్షి’ చిత్రాన్ని ఇటీవల జాతీయ పురస్కారాలు కూడా వరించాయి. దాంతో వంశీ పైడిపల్లి పేరు మరోమారు  ప్రముఖంగా వినిపించింది. ఆయన దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రం ఖరారైంది. తమిళ స్టార్‌ విజయ్‌ కథానాయకుడిగా ఆ చిత్రం రూపొందనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో దిల్‌రాజు నిర్మించనున్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కనున్న ఆ సినిమా విజయ్‌ 66వ చిత్రంగా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం విజయ్‌ తన 65వ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లితో కలిసి రంగంలోకి దిగుతారు. తమిళ కథానాయకుడు కార్తి నటించిన తొలి తెలుగు సినిమా ‘ఊపిరి’ కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే తెరకెక్కడం గమనార్హం. విజయ్‌కి కూడా తెలుగులో బలమైన మార్కెట్‌ ఏర్పడింది. ఆయన నటించిన సినిమాలు ఇటీవల మంచి వసూళ్లని సొంతం చేసుకుంటున్నాయి. ఈ దశలో ఆయన నేరుగా తెలుగు సినిమా చేస్తుండడం కలిసొచ్చే విషయమే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని