రజనీ  పూర్తిచేశారు
close
Published : 12/05/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ  పూర్తిచేశారు

జనీకాంత్‌ కథా నాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అణ్ణాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నెల రోజులుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. సోమవారంతో రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. దీంతో రజనీ చెన్నై బయలు దేరి వెళ్లారు. నెల రోజులు క్రితం ఫిల్మ్‌సిటీలో మొదలైన షెడ్యూల్‌లో రజనీపై కీలక సన్నివేశాల చిత్రీకరణను మొదలు పెట్టారు. రెండు వారాల తర్వాత నయనతార వచ్చి చిత్రీకరణలో పాల్గొన్నారు. ఓ వారం విశ్రాంతి తీసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారట రజనీ. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌.


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని