close
బాలీవుడ్
హసీనాగా తాప్సి

తేడాది నాయికా ప్రాధాన్య చిత్రం ‘శాండ్‌ కీ ఆంఖ్‌’తో మెప్పించింది తాప్సి. ఇప్పుడు మరో చిత్రాన్ని పట్టాలెక్కించింది. ‘హసీనా దిల్‌రూబా’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ నిర్మిస్తున్నారు. వినిల్‌ మాథ్యూ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ‘ఛపాక్‌’లో దీపికా పదుకొణెతో కలసి నటించిన విక్రాంత్‌ మస్సే కీలక పాత్రలో నటిస్తున్నారు. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందతున్నట్లు సమాచారం. శనివారం ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌లో వెల్లడించింది. సెప్టెంబరు 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా తాప్సి ‘రష్మి రాకెట్‌’, ‘తప్పడ్‌’ అనే మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. ‘రష్మి రాకెట్‌’లో పరుగు పందెంలో పాల్గొనే అథ్లెట్‌గా కనిపించనుంది. అనుభవ్‌ సిన్హా తెరకెక్కిస్తున్న ‘తప్పడ్‌’ ఈ ఏడాదే విడుదల కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.