close
బాలీవుడ్
అమితాబ్‌ ఇంట్లో స్టార్లు లాక్‌డౌన్‌

కరోనా నేపథ్యంలో అగ్ర నటుల లఘు చిత్రం

కరోనా వేళ అటు థియేటర్లు లేక ఇటు కొత్త సినిమాలు రాక మొహం వాచిపోయి ఉన్న సినీ ప్రియుల కరవు తీర్చేసేలా ఓ కొత్త సినిమా వచ్చింది. అది అలాంటిలాంటి సినిమా కాదు... అటు బాలీవుడ్‌ ఇటు దక్షిణాది భాషల్లోని అగ్ర కథానాయకులందరూ కలసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం. దాని పేరు ‘ఫ్యామిలీ’. అందులో నటించిన స్టారాధిస్టారుల జాబితా కాస్త పెద్దదే. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, శివరాజ్‌కుమార్‌,  రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌లతో పాటు పంజాబీ నటుడు దిల్జిత్‌ దొసాంజ్‌, బెంగాలీ నటులు ప్రొసెన్‌జిత్‌ ఛటర్జీ, సోనాలీ కులకర్ణి నటించారు. ఆ సినిమా చూడటానికి ఇళ్లు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. నిజానికి ఆ సినిమాను కూడా ఎవరూ గడపదాటకుండానే చిత్రీకరించారు. అందరూ ఇంట్లోనే ఉండండి అని చెప్పడానికే అది తీశారు. అయితే ఆ సందేశాన్నే ఓ ముచ్చటైన కథతో చూపించి మెప్పించారు. పెద్ద స్టార్లు నటించిన ఆ బుల్లి లఘు చిత్రాన్ని యూట్యూబ్‌లో వీక్షించొచ్చు.
అమితాబ్‌ కళ్లజోడెక్కడ: అమితాబ్‌ కూలింగ్‌ గ్లాసెస్‌ కనిపించకపోవడంతో వాటి గురించి రణ్‌బీర్‌, దిల్జిత్‌ అదే ఇంట్లో ఉన్న మిగిలిన నటులను అడుగుతుంటారు. ఆ క్రమంలో వారు చెప్పే సమాధానాలతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. రజనీ తన  స్టైల్లో కూలింగ్‌ గ్లాసెస్‌తో చేసే విన్యాసం, చిరంజీవి గడ్డం గీసుకుంటూ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో దక్షిణాదికి చెందిన నటులు వారి భాషల్లోనే సంభాషణలు చెప్పడం ప్రత్యేకత. చివరకు కూలింగ్‌ గ్లాసెస్‌ దొరికినా, కొన్నాళ్లపాటు నేను బయటకు వెళ్లను కాబట్టి ఇప్పుడు వీటి అవసరం లేదని అమితాబ్‌ చెప్పడం కొసమెరుపు. మీరూ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కరోనా నుంచి రక్షించుకోండని అమితాబ్‌ ప్రేక్షకులతో చెబుతారు. ప్రసూన్‌ పాండే తెరకెక్కించిన ఈ చిత్రంలో నటులు తమ ఇళ్లలోనే ఉండి తమ పాత్రను నటించగా, ఆ భాగాలను కలిపి దీన్ని రూపొందించారు.
సినీ పరిశ్రమ ఒక ‘ఫ్యామిలీ’: భారతీయ సినీ పరిశ్రమ అంతా ఒక కుటుంబమని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమితాబ్‌ వీడియోలో చెప్పారు. వారి సంక్షేమం కోసం నిధులు సేకరిస్తున్నామని, అందుకే ఈ లఘు చిత్రం తీశామని చెప్పారు.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.