దీపావళికి అక్షయ్‌... క్రిస్మస్‌కి రణ్‌వీర్‌
close
Published : 01/07/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళికి అక్షయ్‌... క్రిస్మస్‌కి రణ్‌వీర్‌

కరోనా ప్రభావం ఎప్పటికీ తగ్గుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇది చిత్రసీమపై కాస్త ఎక్కువనే చెప్పాలి. నిబంధనలకు లోబడి తిరిగి షూటింగులు మొదలైనా థియేటర్లు తెరవడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకూ వేచి చూసిన సినిమాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.  సోమవారం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ మల్టీప్లెక్స్‌ ఓటీటీ నుంచి ఏడు చిత్రాలకు సంబంధించిన విడుదల ప్రకటన వచ్చింది. దీంతో కొందరు బాలీవుడ్‌ ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో నెల ఆగితే థియేటర్లు తెరుచుకుంటాయి అనుకుంటున్న పరిస్థితుల్లో ఇలా ఒకేసారి ఏడు చిత్రాలు ఓటీటీ వైపు వెళ్లడం ఏంటని ఎగ్జిబిటర్లు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రెండు బాలీవుడ్‌ చిత్రాలు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధం కావడం శుభపరిణామమే. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘సూర్యవంశీ’ని దీపావళికి, రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘83’ని క్రిస్‌మస్‌కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.       ‘‘ఎగ్జిబిటర్లు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో...ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు ఎప్పుడు వస్తారో అప్పుడు మా సినిమాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీపావళి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని మా నమ్మకం. అందుకే దీపావళికి ‘సూర్యవంశీ’ని, క్రిస్‌మస్‌కి ‘83’ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం’’అని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈవో శిభాషిష్‌ సర్కార్‌ చెప్పినట్టు బాలీవుడ్‌ సమాచారం. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో పోలీస్‌  కథతో తెరకెక్కిన ‘సూర్యవంశీ’లో కత్రినాకైఫ్‌ నాయిక. కపిల్‌దేవ్‌ సారథ్యంలో భారత్‌ క్రికెట్‌ జట్టు 1983లో వరల్డ్‌కప్‌ గెలుచుకున్న నేపథ్యంతో ‘83’ చిత్రాన్ని కబీర్‌ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని