close
Published : 07/07/2020 02:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగస్టులో అక్షయ్‌ విదేశాలకు!

‘బెల్‌బాటమ్‌’ షూటింగ్‌ షురూ


 

లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు ఒకొక్కటిగా మొదలవుతున్నాయి. చాలా సినిమాల చిత్రీకరణలు సగంలోనే ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో కొత్త చిత్రాలనూ సెట్స్‌పైకి తీసుకెళ్లే ధైర్యం చేస్తున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ఏకంగా విదేశాల్లోనే షూటింగుకు సిద్ధమై పోతున్నారు. ఆయన కథా నాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆగస్టులో యూకేలో మొదలు కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రంలోని కీలక పాత్రధారులతో ఉన్న ఓ పోస్టర్‌ను పంచుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే లాక్‌డౌన్‌ తర్వాత విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న తొలి చిత్రం‘బెల్‌బాటమ్‌’ కానుంది. రంజిత్‌ ఎమ్‌ తివారీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో వాణీ కపూర్‌, లారా దత్తా, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని