
సినిమా చాలా విచిత్రమైంది. ఒక్క సినిమా హిట్ అయితే చాలు సెలబ్రిటీ అయిపోవచ్చు. కానీ ఆ సెలబ్రిటీ హోదాను నిలబెట్టుకోవాలంటే కష్టపడాల్సిందే. బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా కూడా ఇదే విషయం చెబుతోంది. ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోలేదు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి సెలబ్రిటీ కల్చర్ ఆమెకు చిన్నప్పటి నుంచీ అలవాటే. కానీ అది ఆమెకు ఇష్టం లేదని చెబుతోంది. సెలబ్రిటీగా ఉండటంలో కష్టంగా అనిపించే విషయం ఏదైనా ఉందా? అంటే ‘‘లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచేలా ఉండటం అంటే మాటలు కాదు కదా’’అని చెప్పింది. ‘‘ప్రజలకు సరైన రోల్ మోడల్లా ఉండాలి. నిజాయతీగా వ్యవహరించాలి. నాకు ఇదంతా కష్టమేమీ కాదు. సెలబ్రిటీగా ఉండటంలో నావరకూ వచ్చిన ఇబ్బంది ఏంటంటే అందరి దృష్టి నా మీదే ఉండటం. ఇలాంటి సెలబ్రిటీ హోదాను అస్సలు ఆస్వాదించలేను’’అని చెప్పింది సోనాక్షి.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..