‘నేనెప్పుడూ స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథల్ని. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథాబలమున్న చిత్రాల్ని అందించేందుకే ఇష్టపడతా. మా సంస్థ నుంచి వచ్చే ప్రతి చిత్రం సమాజానికీ.. భవిష్యత్ తరాలకీ ఉపయోగపడే విధంగా ఉండాలనుకుంటా’’ అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఇప్పుడాయన నిర్మాణం నుంచి వస్తున్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు అభిషేక్ అగర్వాల్.
‘‘1980 - 1990ల మధ్య కాలంలో కశ్మీర్‌లోని హిందూ పండిట్లపై జరిగిన అకృత్యాలను, వారిపై సాగిన మారణహోమాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న చిత్రమిది. చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని అనేక యదార్థ సంఘటనలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. వివేక్ తెరకెక్కించిన ‘తాష్కెంట్ ఫైల్స్’ సినిమా నచ్చి ఆయనతో ఈ చిత్రం చేశాం. మా చిత్రానికి, దర్శకుడికి వ్యతిరేకంగా కశ్మీర్‌లోని ఓ మిలిటెంట్ గ్రూప్ ఫత్వా జారిచేసిందని మా దృష్టికి వచ్చింది. మేమైతే ఈ చిత్రంలో ఏ మతాన్ని కించపరిచే ప్రయత్నం చేయలేదు. వాస్తవాన్ని నిర్భయంగా చూపించబోతున్నాం.’’
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’