లాల్‌ సింగ్‌ సెట్లోకొచ్చాడు
close
Published : 15/06/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాల్‌ సింగ్‌ సెట్లోకొచ్చాడు

రోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సినిమాల సందడి నెమ్మదిగా మొదలైంది. ప్రభుత్వం నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో దానికి తగ్గట్టుగానే చిత్రీకరణలకు ఏర్పాట్లు చేసు కుంటున్నారు. భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి చిన్న సినిమాలకు వరకూ సెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. అక్షయ్‌ ఇప్పటికే ‘పృథ్వీరాజ్‌’ చిత్రం కోసం రంగంలోకి దిగేశారు. తాజాగా మరో ప్రముఖ బాలీవుడ్‌ కథా నాయకుడు ఆమిర్‌ఖాన్‌ కూడా మేకప్‌ వేసుకున్నారు. ఆయన నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ చిత్రీకరణ సోమవారం నుంచి మొదలైనట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని దర్శకుడు అద్వైత్‌ చందన్‌ ఏర్పాట్లు చేస్తున్నారట. ఆమిర్‌ ఇటీవల విశ్వనాథన్‌ ఆనంద్‌తో కలిసి చదరంగం ఆడిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం లైవ్‌లోనే ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ చిత్రీకరణలో తిరిగి పాల్గొననున్న విషయాన్ని ప్రకటించారు ఆమిర్‌. ఆయన మాట్లాడుతూ ‘‘లాల్‌ సింగ్‌..’ చిత్రీకరణ సన్నాహాల్లో పడి, చెస్‌కు సన్నద్ధం కావడానికి టైమ్‌ దొరకలేదు’’అని చెప్పారు. త్వరలోనే లద్దాఖ్‌లో కూడా ఓ కీలక షెడ్యూల్‌ను తెరకెక్కించడానికి ‘లాల్‌ సింగ్‌..’ బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో కరీనా కపూర్‌, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని