మరో ‘బ్రీత్‌’ మొదలైంది
close
Published : 21/10/2021 04:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ‘బ్రీత్‌’ మొదలైంది

భిషేక్‌ బచ్చన్‌, నిత్యామేనన్‌ జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘బ్రీత్‌: ఇన్‌టు ద షాడోస్‌’. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ
నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో కొత్త సీజన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ‘బ్రీత్‌’ బృందం. మయాంక్‌ శర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ కొత్త సీజన్‌ తాజాగా దిల్లీలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘బ్రీత్‌: ఇన్‌టు ది షాడోస్‌’కు కొనసాగింపుగా మరో కొత్త సీజన్‌ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈసారి మరో కొత్త, ఆసక్తికరమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. ఈ కొత్త ‘బ్రీత్‌’ సీజన్‌ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని