close
హాలీవుడ్
నిప్పుతో చెలగాటమాడాను.. తప్పు తెలుసుకున్నాను!

మనసులో మాట

‘హోమ్‌ ఎలోన్‌’ సినిమాలో ఇంట్లోకి దూరిన దుండగులను ఒంటరిగా ఎదుర్కొని ఆట కట్టించాడా కుర్రాడు... కానీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించిన బలహీనతల్ని ఎదుర్కోలేకపోయాడు... ఫలితం... అత్యున్నత శిఖరాల్లోంచి అథఃపాతాళానికి పడిపోయాడు... వెలుగుల కీర్తి ప్రస్థానం నుంచి అవమానాల అంధకారంలో చిక్కుకున్నాడు... అతడే మెకాలే కుల్కిన్‌.

పదేళ్ల వయసులోనే ‘హోమ్‌ ఎలోన్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన చాకులాంటి కుర్రాడు. నాలుగేళ్లకే నటనా ప్రస్థానం... ఎనిమిదేళ్లకే వెండితెర ప్రవేశం... పద్నాలుగేళ్లకల్లా పదిహేను సినిమాలతో ప్రపంచ ప్రాచుర్యం. కొన్నాళ్లు నటనకు స్వస్తి పలికి చదువుకున్నాక  యువకుడిగా వెల్లువెత్తిన కెరటం. నటుడిగా, సంగీతకారుడిగా యువతను ఉర్రూతలూగించిన ప్రయాణం. నూనూగు మీసాల వయసులోనే స్టార్‌డమ్‌ వచ్చిపడింది. డబ్బు, కీర్తి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ మాయలో మనసుకి మత్తెక్కింది. ఆ మత్తు... మాదక ద్రవ్యాల తోడు కోరుకుంది. ఆ వ్యసనం అతడి జీవితాన్ని జారుడుబండ చేసింది. ఫలితంగా జైలు పాలయ్యాడు...

కట్‌ చేస్తే...
తప్పు తెలుసుకున్నాడు. తనలాంటి యువకుల కోసం తన మనసులో మాటను తొలిసారిగా పంచుకున్నాడు... ఇలా!
‘‘అవును. నేను నిప్పుతో చెలగాటమాడాను. ఇప్పుడు తప్పేంటో తెలుసుకున్నాను. వినండి. మంట అంటుకున్నాక, దాన్ని ఆర్పేయడమే తెలివైన పని. ఆ పని నేను చేయగలిగాను. అలాగని నేనెలాంటి డీఅడిక్షన్‌ సెంటర్లలో చేరలేదు. నా అంతట నేనే ఆ ఊబి నుంచి బయటకు రాగలిగాను. నా పాత స్నేహితులు అడుగుతున్నారు... ‘ఎలా బయట పడ్డావు?’ అని. అలాంటి వారికి నేనిచ్చే చెత్త సలహా ఒకటే. ఆపేయండి. వెంటనే ఆపేయండి. నిజానికి వ్యసనాలనేవి వదలని పాత స్నేహితుల్లాంటివి. కానీ     జీవితంలో స్నేహితులను మించి ఎదగగలగాలి. తప్పదు’’.
ఇది తప్పుదారిలో పడే యువతకు ఓ హాలీవుడ్‌ యువతార సందేశం!
వ్యసనాల్లో ఆనందాన్ని వెతుక్కోవాలనుకునేవారికి ఓ సెలబ్రిటీ స్వానుభవం!!


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.