Abhiram Daggubati: నా తప్పులు బయటపడ్డాయి: అభిరామ్‌ - abhiram daggubati about his life and carrer
close
Published : 14/05/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Abhiram Daggubati: నా తప్పులు బయటపడ్డాయి: అభిరామ్‌

హైదరాబాద్‌: తప్పులు అందరూ చేస్తుంటారని.. కాకపోతే తాను చేసిన కొన్ని తప్పులు బయటకు వచ్చాయని నటుడు రానా సోదరుడు అభిరామ్‌ తెలిపారు. మరి కొన్నిరోజుల్లో నటుడిగా వెండితెరకు పరిచయం కానున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రేమ, కుటుంబకథా చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

‘‘తేజ దర్శకత్వం వహించనున్న సినిమాతో నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నాను. ఆయన సినిమాలో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఒకింత భయం కూడా ఉంది. తేజ సర్‌ వర్క్‌ ఎలా ఉంటుందో ‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలోనే అర్థమైంది. ‘నన్ను హీరోగా మీరే పరిచయం చేయాలి సర్‌’ అని ఆ సినిమా షూట్‌లో ఆయనతో అంటుండేవాడిని. ఆయన కూడా నీకోసం తప్పకుండా ఓ కథ రాస్తానని చెప్పేవారు. అలా, ఇటీవల ఓ కథ రాసి నాన్నకు చూపించారు. అది నాన్నకు బాగా నచ్చింది. దాంతో నేను నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నా. కొవిడ్‌ తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టాక సెట్‌లోకి అడుగుపెడతా’’

అనంతరం తనపై వచ్చిన క్యాస్టింగ్‌ కౌచ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ ఆరోపణల పై స్పందిస్తూ.. ‘‘తప్పులందరూ చేస్తారు. నేను చేసిన తప్పులు బయటపడ్డాయి. వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాంటి సమయంలో కుటుంబం నాకు అండగా నిలబడింది. ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు నాకు బాగా తెలిశాయి. నటుడిగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందే ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకూడదని అర్థమైంది’ అని అభిరామ్‌ తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని