ఔరా.. హెరా
close
Published : 04/08/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఔరా.. హెరా

చరిత్ర సృష్టించిన జమైకా రన్నర్‌

200 మీ. పరుగులోనూ స్వర్ణం సొంతం

జమైకా స్ప్రింటర్‌.. ఎలేన్‌ థాంప్సన్‌ హెరా సరికొత్త చరిత్ర సృష్టించింది.వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో మరే మహిళా రన్నర్‌కు సాధ్యం కాని ఘనత సొంతం చేసుకుంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ.. అమ్మాయిల 100మీ, 200మీ. పరుగులో ఛాంపియన్‌గా నిలిచిన తొలి రన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.

టోక్యో

ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌కు.. అందులోనూ 100మీ, 200మీ. పరుగుకు ఉండే ఆకర్షణే వేరు. అలాంటి పరుగులో థాంప్సన్‌ హెరా సత్తాచాటింది. టోక్యోలో ఇప్పటికే అమ్మాయిల 100మీ. పరుగులో ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. తాజాగా 200మీ. పరుగులోనూ పసిడి పట్టేసింది. మంగళవారం ఫైనల్లో 21.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె.. అగ్రస్థానంలో నిలిచి విజయానందంలో మునిగిపోయింది. రజతం గెలిచిన నమీబియా అమ్మాయి క్రిస్టిన్‌.. 21.81 సెకన్ల టైమింగ్‌తో అండర్‌-20 ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గాబ్రియెల్‌ (అమెరికా- 21.87సె) కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో ఫేవరేట్‌గా దిగిన హెరా.. అమ్మాయిల 200మీ. పరుగు చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన టైమింగ్‌ను నమోదు చేస్తూ ఛాంపియన్‌గా నిలవడం విశేషం. 1988 ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్‌ ఫ్లోరెన్స్‌ 21.34 సెకన్లతో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి గెలిచింది. మహిళల 200మీ. పరుగులో వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో స్వర్ణాలు గెలిచిన మూడో అథ్లెట్‌గా హెరా నిలిచింది. వెరోనికా (జమైకా), బార్బెల్‌ (జర్మనీ) ఆమె కంటే ముందున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని