అదరగొట్టిన అమ్లాన్‌
close
Published : 20/09/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదరగొట్టిన అమ్లాన్‌

ఓవరాల్‌ ఛాంప్‌ రైల్వేస్‌

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అస్సాం స్ప్రింటర్‌ అమ్లాన్‌ బోర్గోహెయిన్‌ అదరగొట్టాడు. పోటీల చివరి రోజైన ఆదివారం పురుషుల 200మీ.పరుగులో అతను స్వర్ణం గెలిచాడు. 2014 నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్న ఈ 23 ఏళ్ల రన్నర్‌.. ఫైనల్లో 20.75 సెకన్లలో రేసు పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రీడల్లో ఇది సరికొత్త రికార్డు. ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ (తమిళనాడు) 16.88 మీటర్ల ప్రదర్శనతో పసిడి నెగ్గాడు. మహిళల హ్యామర్‌ త్రోలో హర్దీప్‌ కౌర్‌ తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (64.42మీ) నమోదు చేసి బంగారు పతకం అందుకుంది. మొత్తంగా 36 పతకాలతో రైల్వేస్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రవీణ్‌, హర్మిలన్‌ ఉత్తమ  అథ్లెట్లుగా నిలిచారు. ముగింపు వేడుకలకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఛీప్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని