కరోనా వైరస్‌ బలహీనత ఇదే!
close
Published : 20/12/2020 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వైరస్‌ బలహీనత ఇదే!

శత్రువు బలహీనత తెలిస్తే తేలికగా మట్టుపెట్టొచ్చు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌2 విషయంలోనూ శాస్త్రవేత్తలు దీన్ని తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నారు. ఎట్టకేలకు దీని బలహీనతను కనుగొన్నారు. సార్క్‌-కోవ్‌2 వృద్ధి చెందటానికి, ఇది ఇతర కణాలకు విస్తరించటానికి తోడ్పడుతున్న ప్రొటీన్‌ను గుర్తించారు. దీని పేరు టీఎంఈఎం41బి (ట్రాన్స్‌మెంబ్రేన్‌ ప్రొటీన్‌ 41 బి). కరోనా వైరస్‌ మీద ఒక కొవ్వు పొర ఉంటుంది. వైరస్‌ జన్యు పదార్థాన్ని కాపాడేది ఇదే. ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణం లోపల సార్స్‌-కోవ్‌2 వృద్ధి చెందే సమయంలో ఈ కొవ్వు పొర రూపుదిద్దుకోవటానికి టీఎంఈఎం41బి తోడ్పడుతున్నట్టు తేలింది. వైరస్‌ ఇతర కణాలకు విస్తరించటానికీ ఇదే కీలకంగా పనిచేస్తుండటం గమనార్హం.

ఎల్లో ఫీవర్‌, వెస్ట్‌ నైల్‌, జికా జబ్బులకు కారణమయ్యే ప్లావీవైరస్‌ల మాదిరిగానే సార్స్‌-కోవ్‌2 వంటి కరోనా వైరస్‌లు వృద్ధి చెందటంలో టీఎంఈఎం41బి ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంటే దీన్ని అడ్డుకోగలిగితే వైరస్‌ వృద్ధిని నిలువరించొచ్చన్నమాట. అందుకే కొత్త చికిత్సల రూపకల్పనకు అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నారు. కాబట్టే కరోనా వైరస్‌ వృద్ధిలో టీఎంఈఎం41బి పాత్రను మరింత సునిశితంగా విశ్లేషించటంపైనా పరిశోధకులు దృష్టి సారించారు. వైరస్‌ను అడ్డుకునే మందులను పరీక్షించటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు. ఇది విజయవంతమైతే త్వరలోనే కొవిడ్‌-19ను నయం చేసే చికిత్సలు అందుబాటులోకి రావటం తథ్యంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని