మధ్యప్రదేశ్‌కు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌లు
close
Updated : 26/07/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యప్రదేశ్‌కు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌లు

భారీ వర్ష సూచన

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో సోమవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 52 జిల్లాలు ఉండగా, 23 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను ప్రకటిస్తున్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. ఎల్లో అలెర్ట్‌ అంటే భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించడం. ఆరెంజ్‌ అలెర్ట్‌ అంటే భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు వంటి వాతావరణం నెలకొంటుందని, దానిని ఎదుర్కోవడానికి తగిన సన్నాహాలు చేసుకోవాలని అధికారులను అప్రమత్తం చేయడం. రుతు పవనాలు రాష్ట్రం మీదుగా కొనసాగుతున్నందున విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఆదివారం కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని