క్రొయేషియాలో బస్సు బోల్తా.. 10మంది మృతి
close
Published : 26/07/2021 03:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రొయేషియాలో బస్సు బోల్తా.. 10మంది మృతి

జాగ్రెబ్‌: క్రొయేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 45 మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం జాగ్రెబ్‌-సెర్బియా సరిహద్దు మధ్య ఉన్న స్లావోన్స్కి వద్ద రహదారిపై బస్సు బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. దీంతో 60 మందికి పైగా ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణం తెలియలేదు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్‌ ప్లెన్‌కోవిక్‌ దిగ్భా‌్రంతి వ్యక్తంచేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని