పసుపు వర్ణంలోకి నాలుక!
close
Published : 26/07/2021 04:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసుపు వర్ణంలోకి నాలుక!

కెనడా బాలుడికి అరుదైన వ్యాధి

దిల్లీ: కెనడాలో 12 ఏళ్ల బాలుడిలో కనిపించిన విచిత్ర వ్యాధి కారణంగా నాలుక మొత్తం పసుపు వర్ణంలోకి మారిపోయింది. అతడి రోగ నిరోధక వ్యవస్థ.. స్వీయ ఎర్ర రక్తకణాలపై దాడి చేసి, వాటిని నాశనం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని వైద్యులు తేల్చారు. గొంతునొప్పి, మూత్రం ముదురు ఎరుపు వర్ణంలోకి మారడం, కడుపునొప్పి, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు ఈ బాలుడిలో కనిపించాయి. దీంతో టొరంటోలోని ‘హాస్పిటల్‌ ఫర్‌ సిక్‌ చిల్డ్రన్‌’లో చేర్పించారు. తొలుత ఈ సమస్యను కామెర్లుగా వైద్యులు భావించారు. బాలుడి నాలుక కూడా ముదురు పసుపు వర్ణంలోకి మారడం చూసి విస్తుపోయారు. దీంతో పలు పరీక్షలు నిర్వహించాక అతడికి రక్తహీనత ఉందని, ఎప్‌స్టెయిన్‌ బార్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని గుర్తించారు. చిన్నతనంలో ఈ వైరస్‌ సాధారణంగా సోకుతుంటుంది. దీనివల్ల అనేక రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులు తలెత్తుతుంటాయి. అంతిమంగా ‘కోల్డ్‌ అగ్లూటినిన్‌’ అనే వ్యాధి ఉన్నట్లు తేల్చారు. ఇది చాలా అరుదైన ఆటోఇమ్యూన్‌ రుగ్మత. ఈ వ్యాధి ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి.. స్వీయ ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తుంది. చలి వాతావరణం కారణంగా ఇది ఉత్పన్నమవుతుంది. ఎప్‌స్టెయిన్‌ బార్‌ వైరస్‌ కారణంగా సోకిన ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఆ బాలుడు ఈ వ్యాధి బారినపడి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. కోల్డ్‌ ఆగ్లూటినిన్‌ వల్ల రక్తహీనత తలెత్తుతుందని, ఎర్ర రక్తకణాలు వేగంగా విచ్ఛిన్నమవుతాయని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పేర్కొంది. దీనివల్ల బైలిరుబిన్‌ పెరిగిపోతుందని, అది అంతిమంగా కామెర్లకు దారితీస్తుందని తెలిపింది. చికిత్సలో భాగంగా బాలుడికి రక్తమార్పిడి చేశారు. స్టెరాయిడ్లు ఇచ్చారు. 7 వారాల చికిత్స అనంతరం అతడు వేగంగా కోలుకున్నాడని.. నాలుక క్రమంగా సాధారణ రంగులోకి వచ్చేసిందని వైద్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని