ఒకసారి కరోనా వస్తే.. 6 నెలల వరకు రక్షణ!
close
Published : 16/09/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకసారి కరోనా వస్తే.. 6 నెలల వరకు రక్షణ!

వాషింగ్టన్‌: ఒకసారి కరోనా బారినపడ్డ వారికి రెండోసారి మహమ్మారి సోకకుండా ఎన్నాళ్లు రక్షణ ఉంటుంది? దాదాపు గత ఏడాదిన్నర కాలంగా కోట్ల మంది మెదళ్లలో మెదిలిన ప్రశ్న ఇది! కనీసం నెల, 3 నెలలు అంటూ పలువురు పరిశోధకులు, నిపుణుల నుంచి దానికి రకరకాల సమాధానాలొచ్చాయి. తొలిసారి వైరస్‌ సోకినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే.. యాంటీబాడీలు అధిక కాలం పాటు రక్షణ కల్పిస్తాయని కూడా చాలా అధ్యయనాలు తేల్చాయి. అయితే మొదటిసారి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా.. వ్యక్తులు రెండోసారి కరోనా బారిన పడకుండా దాదాపు ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా నిర్ధారించారు. మొత్తం 130 మందిపై వారు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ను సమర్థంగా నిలువరించే యాంటీబాడీలు.. 90% మందిలో తొలిసారి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాక దాదాపు 6 నెలల వరకు సమర్థంగా పనిచేశాయని గుర్తించారు. తొలి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత వాటిపై ప్రభావం చూపలేదని తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని