Hyd:ఆదేశాలేవైనా.. గాంధీ సిద్ధం!
close
Published : 22/06/2021 08:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyd:ఆదేశాలేవైనా.. గాంధీ సిద్ధం!

ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి: సత్వరమే సాధారణ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకయినా.. కరోనా మూడోదశ వచ్చినా.. రోగులకు సేవలందించేందుకు గాంధీ ఆసుపత్రి యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఉన్నతాధికారులు ఏ విధమైన ఆదేశాలు జారీ చేసినా.. అందుకు అనుగుణంగా చికిత్స అందించేందుకు ఇక్కడి పాలనాధికారులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా రెండోదశ అదుపులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇక్కడికి వచ్చే కొవిడ్‌ రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒకటి, ఐదో అంతస్తులు పూర్తిగా ఖాళీ కావడంతో.. వాటిని శుభ్రం చేసి, మూసివేశారు. అత్యవసర విభాగంలోనూ కొన్ని వార్డులు ఖాళీ అయ్యాయి. సమయం దొరకడంతో అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు.

లైబ్రరీ హాల్‌కు తరలించేలా..

ప్రస్తుతం గాంధీకి రోజుకు 60 మంది వరకు రోగులు వస్తుంటే.. వారిలో సగం మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులే ఉంటున్నారు. ఆసుపత్రి ప్రధాన భవన సముదాయంలోని ఆరో అంతస్తులో వారికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. మిగతా అంతస్తుల్లో కొవిడ్‌, బ్లాక్‌ఫంగస్‌ రోగులు ఉన్నారు. వైరస్‌ బాధితులు 300కు పైగా మాత్రమే ఉండటం.. మరో వారం పదిరోజుల్లో వారి సంఖ్య 200లోపే చేరే అవకాశాలున్నాయని భావిస్తున్న యంత్రాంగం, వారందరినీ మెడికల్‌ కళాశాల ప్రాంగణంలోని లైబ్రరీ హాల్‌లోకి మార్చాలని యోచిస్తోంది. అక్కడ ఇప్పటికే 200 వరకు అదనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ పడకలున్నాయి. రోగులను అందులోకి తరలిస్తే.. ఆసుపత్రి మొత్తం ఖాళీ అవుతుంది. అప్పుడు సాధారణ వైద్యసేవలు అందించేందుకు వీలవుతుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని