Crime news: చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసి.. ‘డయల్‌-100’కు ఫోన్‌ చేసి.. - Cut the ear with a knife and dails 100
close
Updated : 24/06/2021 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసి.. ‘డయల్‌-100’కు ఫోన్‌ చేసి..

కొత్తగూడెం రామవరం, న్యూస్‌టుడే: తనను దూషించాడనే కోపంతో ఓ వ్యక్తి మర్మాంగాన్ని, చెవిని కత్తితో కోసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తోపుడు బండిపై చిల్లర సామగ్రి విక్రయించుకునేందుకని హైదరాబాద్‌కు చెందిన రుద్రారపు కార్తీక్‌ కొత్తగూడెం రుద్రంపూర్‌ ప్రాంతానికి అయిదు రోజుల క్రితం వలసవచ్చాడు. స్థానికంగా శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో తాత్కాలికంగా నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్‌పాషా మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో కార్తీక్‌ను వ్యక్తిగతంగా దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన కార్తీక్‌ హుస్సేన్‌పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోశాడు. ఆ తర్వాత ‘డయల్‌-100’కు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుణ్ని అరెస్టు చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని