AP News: పెళ్లి పేరుతో భూత వైద్యుడి మోసం
close
Updated : 29/07/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: పెళ్లి పేరుతో భూత వైద్యుడి మోసం


నిందితుడు వసీమ్‌

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: చిట్టినగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతికి(21) మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తెలిసిన వారి సూచన మేరకు ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన ఎండీ.వసీమ్‌(32) అనే భూత వైద్యుడిని పిలిపించారు. చాలా రోజుల నుంచి మందులు వాడుతున్న తమ కుమార్తె మానసిక స్థితి బాగుపడలేదని ఏదైనా తాయిత్తు, వైద్యం చేసి నయం చేయాలని తల్లిదండ్రులు అతన్ని కోరారు. ఆమెను పరిశీలించిన వసీమ్‌.. యువతికి దెయ్యం పట్టిందని వదిలించాలంటే రూ. లక్ష వరకు ఖర్చవుతుందని తెలిపాడు. అతని మాటలు నమ్మిన యువతి తల్లిదండ్రులు అడిగిన మొత్తాన్ని ఇచ్చారు. ఈ సారి ఆమె కోలుకుని స్పందించడం ప్రారంభించింది. అతని మాటతోపాటు తల్లిదండ్రులు చెప్పిన వాటికి బదులివ్వడం చేస్తుండేది. ఈక్రమంలో భూతవైద్యుడు వసీమ్‌ యువతితో చరవాణిలో మాట్లాడటం ప్రారంభించాడు. తన భార్య చనిపోయిందని రోజుకు రూ.50వేలకు పైగా సంపాదిస్తానని తన వద్దకు రమ్మని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అప్పటి నుంచి సదరు యువతి తనకు పెళ్లి చేయమని తల్లిని అడుగుతుండేది. ఈ నెల 9వ తేదీన తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. తల్లి భవనంపై దుస్తులు ఆరేస్తున్న సమయంలో బంగారం వస్తువులు తీసుకుని ఇంటి నుంచి ఆమె వెళ్లిపోయింది. కుమార్తె అదృశ్యంపై ఈ నెల 11వ తేదీన 2వ పట్టణ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

రైలులో దిల్లీకి...

యువతి తీసుకెళ్లిన చరవాణి ఆధారంగా భూతవైద్యుడే ఆమెకు నిర్దేశిస్తూ.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వరకు కారులో.. అక్కడి నుంచి అతని మిత్రుడు తాయబ్‌(31) సాయంతో దిల్లీ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన యువతి తండ్రి.. భూతవైద్యుడు వసీమ్‌తో మాట్లాడి.. తన కుమార్తె దిల్లీ వచ్చిందని మీ దగ్గరే ఉంచమని తమ వాళ్లు వస్తున్నారని చెప్పారు. తర్వాత యువతి బంధువులు ఉత్తరప్రదేశ్‌ వెళ్లగా.. ఆమె తమ దగ్గరికి వచ్చిన మాట వాస్తవమేనని.. ఓ నది వద్ద నిలబడి మాట్లాడుతుండగా సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఆమె మృతిచెందినట్లు వసీమ్‌ వారితో చెప్పాడు. దీంతో ఆ యువతి బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె నదిలో పడి మృతిచెందిందా, లేదంటే ఎక్కడైనా దాచిపెట్టారా అనే విషయాలు తేలాల్సి ఉంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని