పెళ్లికి నిరాకరించి కోర్టుకు ఈడ్చిందని.. ప్రేమికురాలిపై కత్తితో దాడి
close
Updated : 05/08/2021 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లికి నిరాకరించి కోర్టుకు ఈడ్చిందని.. ప్రేమికురాలిపై కత్తితో దాడి

ఆపై యువకుడి ఆత్మహత్యాయత్నం


కత్తితో పొడుచుకొని పడిపోయిన గిరీశ్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ప్రేమించిన తనను కాదని.. కోర్టుకు ఈడ్చి జరిమానా వేయించిందన్న కక్షతో ప్రేమికురాలిపై కత్తితో దాడిచేసిన ఓ ప్రేమోన్మాది అదే కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్సై సుధాకర్‌రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌ జవహర్‌నగర్‌కు చెందిన గిరీశ్‌(24) ఓ హోటల్‌లో అసిస్టెంట్‌ చెఫ్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. న్యూ బోయిన్‌పల్లి బాపూజీనగర్‌కు చెందిన ఓ యువతి(22) స్థానికంగా ఉన్న సూపర్‌ మార్కెట్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తుంది. గిరీశ్‌ మారేడుపల్లిలో ఇంటర్‌ చదివే రోజుల్లో ఆమెతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. నాలుగైదేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. వివిధ కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. మరోవైపు యువతి కుటుంబసభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

వేధిస్తున్నాడని కేసు..

విషయం తెలిసి గిరీశ్‌ రెండుసార్లు యువతి ఇంటికొచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబసభ్యులకు చెప్పాడు. అందుకు ఆమె కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో ప్రేమించిన తననే వివాహం చేసుకోవాలని యువతిని వేధిస్తున్నాడు. దీనిపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు 15 రోజుల క్రితం పిట్టీ కేసు నమోదుచేశారు. ఈ మేరకు గిరీశ్‌, ఆ యువతి బుధవారం కోర్టులో హాజరై పరస్పర అంగీకారానికి రావడంతో న్యాయస్థానం అతణ్ని మందలించి రూ.50 జరిమానా విధించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన అతడు యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలి నడుము, చేతిపై గాయాలయ్యాయి. అనంతరం అదే కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. స్థానికుల సమాచారంమేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నిందితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని