RS Praveen Kumar: ‘మీ పవర్‌ కట్‌ చేసే రోజులు దగ్గరపడ్డాయి’
close
Updated : 05/08/2021 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RS Praveen Kumar: ‘మీ పవర్‌ కట్‌ చేసే రోజులు దగ్గరపడ్డాయి’

8వ తేదీ సభ దేశ చరిత్రలో నిలవాలి

మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రజల సమస్యల కోసం ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేయడం ఆనందంగా ఉందని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని వివేర హోటల్‌ బుధవారం ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బహుజనులకే రాజ్యాధికారం రావాలన్నారు. ఈ నెల 8న నల్గొండలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభ దేశ చరిత్రలో నిలవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మాయావతి ప్రధాని అవడానికి ఈ సభ సంకేతం కావాలన్నారు. 70 ఏళ్లుగా బహుజనులు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పెత్తందారీతనం పోవాలంటే బహుజనులకే రాజ్యాధికారం రావాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో డబ్బు వంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు.

మీ పవర్‌ కట్‌ చేసే రోజులు దగ్గరపడ్డాయి: ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌

‘‘ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్‌ టైమ్‌లోనే పవర్‌ కట్‌ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న మీ రాజప్రాసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్‌కట్‌ చేసే రోజులు దగ్గరపడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి’’ అంటూ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని