సురక్షితంగా వాట్సప్‌ బ్యాకప్‌
close
Published : 15/09/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సురక్షితంగా వాట్సప్‌ బ్యాకప్‌

ఛాట్‌ బ్యాకప్‌ను మరింత సురక్షితం చేయాలని వాట్సప్‌ సంకల్పించింది. దీంతో ఇకపై చాట్‌ మాత్రమే కాదు, బ్యాకప్‌ కూడా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (ఈ2ఈఈ) పద్ధతిలో క్లౌడ్‌ సంస్థల్లో సేవ్‌ అవుతుంది. నిజానికి వాట్సప్‌ వాడేవారు ఇప్పటికే తమ సందేశాల హిస్టరీని గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ వంటి క్లౌడ్‌ ఆధారిత సంస్థల్లో బ్యాకప్‌ చేసుకుంటున్నారు. ఇవేవీ వాట్సప్‌కు అందుబాటులో ఉండవు. వ్యక్తిగత క్లౌడ్‌ సరంక్షణలోనే ఉంటాయి. ఈ2ఈఈ బ్యాకప్‌ అందుబాటులోకి వచ్చాక వాట్సప్‌ గానీ క్లౌడ్‌ సంస్థలు గానీ బ్యాకప్‌ ఎన్‌క్రిప్షన్‌ కీని వాడుకోలేవు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే- ఇది డిఫాల్ట్‌ ఫీచర్‌ కాకపోవటం. ఎవరికివారే దీన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఛాట్స్‌ భద్రతకు ఉపయోగపడుతున్న ఎన్‌క్రిప్షన్‌ పద్ధతే బ్యాకప్‌ సురక్షితంగా ఉండటానికీ తోడ్పడుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని